ఇదీ ప్లాన్ : వైసీపీకి 20 ఎంపీ స్థానాలు – కేసీఆర్ ఉప ప్ర‌ధాని..?

0
234

తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విపై ఎటువంటి ఆశ లేద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దాంతో జాతీయ రాజ‌కీయాల‌పై సీఎం కేసీఆర్‌కు ఆస‌క్తి లేద‌ని, కేవ‌లం తెలంగాణ రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావాల‌నుకుంటున్నాడ‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావించారు.

అయితే, సీఎం కేసీఆర్ ఆ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం వెనుక భారీ ప్లానే ఉంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారాన్నిబ‌ట్టి తెలుస్తుంది. టీఆర్ఎస్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు, రాజ‌కీయ విశ్లేష‌కులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో, టీఆర్ఎస్ బ‌లా బ‌లాల అంచ‌నా మేర‌కు కేసీఆర్ ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్ట‌డం అసాధ్య‌మ‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. కానీ, మ‌రింత ఫోక‌స్ చేస్తే మాత్రం ఉప ప్ర‌ధాని సీటును చేజిక్కించుకోవ‌డం కాస్త ఈజీప‌నేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఆ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ ఉప ప్ర‌ధాని సీటు దిశగా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌, క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామిని క‌లిసిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాక మ‌రో ఏపీలో వైసీపీ మ‌ద్ద‌తు టీఆర్ఎస్‌కు ఎలానో ఉండ‌నే ఉంది. ఈ లెక్క‌న ఇప్ప‌టి వ‌ర‌కు తాను క‌లిసిన వారంద‌రూ మ‌ద్ద‌తు ఇస్తే కేసీఆర్ ఉప ప్ర‌ధాని అవ‌డం ఖాయ‌మ‌న్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా, సీఎం కేసీఆర్ ఇటీవ‌ల తెలంగాణ కేబినేట్ స‌మావేశంలో మాట్లాడుతూ ఏపీలో వైసీపీకి 20 ఎంపీ స్థానాలు వ‌స్తాయ‌ని చెప్ప‌డంతోపాటు, అధికారం కూడా ఆ పార్టీదేన‌ని స్ప‌ష్టం చేశారు.