‘రామ్’ బర్త్ డే కానుకగా.. ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్

0
594
ram pothineni birthday
ram pothineni ismart shankar teaser

డేరింగ్ & డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ పోతినేని సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. దాదాపుగా ఈ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈరోజు రామ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర బృందం వారు ఆయనకు విష్ చేస్తూ .. తాజాగా చిత్ర టీజర్ ని వదిలారు.

టీజర్ లో రామ్ పాత్ర ఫుల్లీ మాస్ గా కనిపించింది. మాస్ ఏరియలో దాదాగిరి చేస్తూ … మాస్ లీడర్ గా శంకర్ న్యూ లుక్ లో దర్శన మిచ్చాడు. “నాతో కిరికిరంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలును గట్టేసినట్టే” అనే హైదరాబాది మాస్ లాంగ్వేజ్ లో రామ్ డైలాగ్ అదుర్స్ అని చెప్పవచ్చు. చాక్ లెట్ బాయ్ లాంటి రామ్ మాస్ లుక్ లో కనిపించడం కొత్తగా ఉన్నా … పూరి డిఫరెంట్ గా ప్రయత్నించాడని మాత్రం అర్ధమవుతుంది.