ఏపీ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థుల జాబితా ఇదేనా..? సోష‌ల్ మీడియాలో ఫైన‌ల్ లిస్ట్‌ వైర‌ల్..!

0
277

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టారు. తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని స‌కుంటుంబ స‌ప‌రివార స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మ‌రికొద్ది సేప‌ట్లో తిరుమ‌ల తిరుప‌తి వేదిక‌గా రెండో విడ‌త అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితాను సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ జాబితాతోపాటు ఎంపీ అభ్య‌ర్థుల లిస్టును కూడా చంద్ర‌బాబు విడుద‌ల చేయ‌నున్నారు.

ఆ త‌రువాత తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న టీడీపీ స‌భ‌లో పాల్గొని, అనంత‌రం నేటి సాయంత్రం శ్రీ‌కాకుళంకు బ‌య‌ల్దేరి వెళ‌తారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న టీడీపీ స‌భ‌కు ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే భారీ ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉండ‌గా, టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులకు సంబంధించి చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న జాబితాలోని వివ‌రాలు ఇలా ఉన్నాయంటూ ప‌లు మీడియా ఛానెళ్లు క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తున్నాయి. ఆ వివ‌రాల ప్ర‌కారం టీడీపీ ఎంపీ అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి..

శ్రీ‌కాకుళం : రామ్మోహ‌న్ నాయుడు
విజ‌య‌న‌గ‌రం : అశోక్ గ‌జ‌ప‌తి రాజు
అర‌కు : కిశోర్ చంద్ర‌దేవ్‌
విశాఖ : ముళ్ల‌పూడి రేణుక / ప‌ల్లా శ్రీ‌నివాస్‌
అన‌కాప‌ల్లి : ఆడారి ఆనంద్‌
కాకినాడ : చ‌ల‌మ‌శెట్టి సునీల్
అమ‌లాపురం : జీఎంసీ ర‌మేశ్‌
ఏలూరు : మాగంటి బాబు
విజ‌య‌వాడ : కేశినేని నాని
గుంటూరు : గ‌ల్లా జ‌య‌దేవ్‌
న‌ర‌సారావుపేట : రాయ‌పాటి సాంబ‌శివ‌రావు
బాప‌ట్ల : తెనాలి శ్రావ‌ణ్‌కుమార్
ఒంగోలు : శిద్ధా రాఘ‌వ‌రావు
నెల్లూరు : బీద మ‌స్తాన్‌రావు
చిత్తూరు : శివ ప్ర‌సాద్
తిరుప‌తి : ప‌న‌బాక ల‌క్ష్మీ
క‌డ‌ప : ఆది నారాయ‌ణ‌రెడ్డి
హిందూపురం : నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌
అనంత‌పురం : జేసీ ప‌వ‌న్‌
క‌ర్నూలు : కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి
రాజ‌మండ్రి : ముళ్లపూడి రేణుక / మాగంటి రూప / బొడ్డు భాస్క‌ర‌రావు

మ‌రో మూడు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి అభ్య‌ర్థుల వివ‌రాలు మ‌రికొద్ది సేప‌ట్లో సీఎం చంద్ర‌బాబు విడుద‌ల చేయ‌నున్న ఫైన‌ల్ జాబితాతో తెలుస్తాయ‌ని ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది.