వీరి క‌ల‌యిక ఒక్క‌ట‌య్యేందుకేనా..?

0
108

జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, సినీ ఇండ‌స్ట్రీలో ప‌లువురు దేవుడిగా కొలిచే ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు ఫోన్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జ‌న‌సేన జ‌త‌క‌ట్టేందుకు సిద్ధ‌మ‌ని నాతో చెప్పాడు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలంటే వైసీపీ, జ‌నసేన పార్టీలు రెండూ ఏకంకాక త‌ప్ప‌దని చెప్పారు. ఈ మేర‌కు చ‌ర్చ‌ల‌ను ముందుకు తీసుకుపోదామంటూ ఫోన్‌లో నాతో చ‌ర్చించాడంటూ గ‌త రెండు నెల‌ల క్రితం వైసీపీ మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ మీడియా వేదిక‌గా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

నాడు మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ చెప్పిన మాట‌ల‌ను ప్ర‌తీ ఒక్క‌రు కొట్టిపారేశారు. వైసీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీచేయ‌డ‌మా..? నో.. అలా ఎప్ప‌టికీ జ‌ర‌గ‌దు, వ‌ర‌ప్ర‌సాద్ ఏదో మీడియాలో క‌న‌ప‌డేందుకే అలా చెబుతున్నాడంటూ ప‌లువురు మీడియా స‌మావేశాల్లో ఆయ‌న్ను ఎద్దేవ చేశారు. కానీ, వ‌ర‌ప్ర‌సాద్ నాడు చెప్పిందే నేడు నిజం కాబోతుందంటూ సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైర‌ల్ అయిపోతోంది. అదే, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ల ఆలింగనం.

జ‌గ‌న్‌ను చిరంజీవి ఆలింగం చేసుకుంటున్న స‌మ‌యంలో ఓ ఫోటో గ్రాఫ‌ర్ తీసిన ఫోటోను వైసీపీ శ్రేణులు సోష‌ల్ మీడియాలో షేర్లు కొడుతున్నారు. వీరి ఆలింగనం ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌కే దారితీసింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం అతి త్వ‌ర‌లో ఏపీ వ్యాప్తంగా సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌ట‌మే.

అయితే, ఇటీవ‌ల కాలంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో నిర్వ‌హించిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌ల్లో ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబుకు అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రో అడుగు ముందుకేసి ఏపీని అవినీతిలో నెంబ‌ర్ 1 చేసిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుదేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలాగే వైఎస్ జ‌గ‌న్ కూడా తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చంద్ర‌బాబు చేసిన అవినీతి ఇదంటూ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలా వారిద్ద‌రూ ఏ స‌భ నిర్వ‌హించినా సీఎం చంద్ర‌బాబు అవినీతి చేశాడంటూ విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌సంగాల‌ను కొన‌సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం.