ఐపీఎల్ 2019 : బెంగళూరుపై ఢిల్లీ విజయం..!

0
230

ఐపీఎల్ 2019 సీజన్లో ఆర్సీబీ ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ మరో ఎండ్ నుంచి బ్యాట్స్ మెన్స్ వరుసగా ఫెవిలిన్ బాటపట్టారు. కోహ్లికుడా 41 పరుగులు చేసి వెనుతిరిగారు.

చివర్లో మొయిన్ అలీ మాత్రమే 32 పరుగులు చేసి కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్ రబడా దెబ్బకు ఆర్సీబీ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు.

150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధావన్ డకౌట్ గా వెనుదిరిగాడు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం నిలకడగా ఆడుతూ 50 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది.