ఐపీఎల్ 2019 : కోల్‌క‌తాపై ఢిల్లీ విజ‌యం..!

0
88

శుక్ర‌వారం ఈడెన్‌గార్డెన్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ షాక్ ఇచ్చింది. కోల్‌క‌తాపై ఏడు వికెట్‌ల తేడాతో కోల్‌క‌తాపై అల‌వోకగా ఢిల్లీ విక్ట‌రీని సొంతం చేసుకుంది.179 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఓపెన‌ర్లు మంచి ఆరంభాన్ని అందించారు.

అయితే, వ‌రుస ఓపెన‌ర్ల‌లో విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్న స్టార్ ఆట‌గాడు శిఖ‌ర్‌ధావ‌న్ గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ రేంజ్‌లో మ్యాచ్‌ను ఆదుకున్నాడు. యంగ్ వికెట్ కీప‌ర్ రిష‌బ్‌పంత్ తోడుగా భారీ భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. రిష‌బ్ పంత్ 31 బంతుల్లో నాలుగు ఫోర్‌లు, రెండు సిక్స‌ర్ల‌తో 46 ప‌ర‌గులు చేశాడు. విజ‌యానికి ఐదు పరుగులు కావాల్సిన యంగ్‌రామ్స్ సిక్స్ కొట్ట‌డంతో ధావ‌న్ సెంచ‌రీ మిస్ అయ్యాడు. శిఖ‌ర్ ధావ‌న్ 63 బంతుల్లో 11 ఫోర్‌లు, రెండు సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌క‌తా బౌల‌ర్‌ల‌లో ర‌స్సెల్, నితీష్ రానా, ప్ర‌సిద్ధ చెరో వికెట్ తీశారు.

అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవ‌ర్ మొద‌టి బంతికే కోల్‌క‌తా ఓపెన‌ర్ జో డెన్లీ బౌల్డ్‌ అయ్యాడు. కాగా, ఇది జో డెన్లీకి ఆరంగ్రేట‌పు మ్యాచ్ తొలి ఐపీఎల్ మ్యాచ్‌తోనే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

సుగ్మ‌న్ గిల్ 39 బంతుల్లో 65 ప‌రుగులు చేయ‌గా, ఆండ్రూ ర‌స్సెల్ 21 బంతుల్లో 45 ప‌రుగుల‌తో చెలరేగి ఆడాడు. దాంతో కోల్‌క‌తా నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బౌర్ల‌లో క్రిస్ మోరీస్, ర‌బ‌డ‌, కిబోపాల్‌లు త‌లో రెండు వికెట్‌లు సాధించ‌గా, ఇషాంత్ శ‌ర్మ వికెట్ తీశాడు.