వైఎస్ జ‌గ‌న్‌పై శ్రీ‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

0
150

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సినీ న‌టి శ్రీ‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కాగా, శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల కాలంలో ఫేస్‌బుక్ వేదిక‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మ‌ద్ద‌తుగా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌లు వివాద‌స్ప కామెంట్లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర ఇవాళ ముగుస్తున్న నేప‌థ్యంలో శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇక అస‌లు విష‌యానికొస్తే, దాదాపు 14 నెల‌ల‌పాటు వైఎస్ జ‌గ‌న్ అవిశ్రాంతంగా పాద‌యాత్ర చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. వైఎస్ జ‌గ‌న్‌లా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేసిన దాఖ‌లు లేవ‌ని, 341 రోజులు 3648 కి.మీ ద‌గ్గ‌ర పాద‌యాత్ర పూర్తి చేయ‌డం జ‌గ‌న్ ఒక్క‌డికే చెల్లింద‌ని చెప్పింది.

పాద‌యాత్ర చేస్తున్న త‌న‌ను క‌లిసేందుకు ప్ర‌తీ ఒక్క‌రితోనూ జ‌గ‌న్ న‌వ్వుతూ ఆప్యాయంగా ప‌లుక‌రించార‌ని, ఆ ప‌ల‌క‌రింపే వైఎస్ జ‌గ‌న్‌ను ఈ ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో సీఎంను చేయ‌నుంద‌ని శ్రీ‌రెడ్డిత‌న అభిప్రాయాన్ని తెలిపింది. అంతేకాకుండా, వైఎస్ జ‌గ‌న్ మీ క‌ష్ట సుఖాల్లో తానున్నానంటూ ప్ర‌జ‌ల‌నుద్దేశించిన తీరు న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుంద‌ని, ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్‌పై మ‌రింత న‌మ్మ‌కాన్ని ఉంచార‌న్ని పేర్కొంది.