ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్… ఆందోళనలో విద్యార్ధులు

0
129
Inter chemistry paper leak ... students in anxiety
Inter chemistry paper leak

ఆంద్రప్రదేశ్ లో ఇంటర్ మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న నేపధ్యంలో, కెమిస్ట్రీ ప్రశ్నా పత్రం లీకైన ఘటన గుంటూరులోని సత్తెనపల్లోలో చోటు చేసుకుంది. కాగా పరీక్షా ప్రారంభం కావడానికి గంట ముందే ప్రశ్నా పత్రం బయటకు వచ్చేసింది. ఈ విషయం వెంటనే అధికారుల దృష్టికి రావడంతో వారు అప్రమత్తమయ్యారు. దీనిపై విచారణ ను ప్రారంభించారు. ఇది ఇలా ఉంటే ఈ పరీక్ష చివరిది కావడం, ఉన్నట్టుండి పేపర్ లీక్ అవ్వడం వంటి వార్తలతో విధ్యార్ధులు కంగారు పడుతున్నారు. ఒకవేళ లీకైనట్టు పక్కా సమాచారం వస్తే, ఈ సెంటర్ లో పరీక్షను తిరిగి నిర్వహించే అవకాశం ఉంది.