మరో అద్భుతం చేసిన భారత్ : “నిర్భయ్‌” ప్రయోగం విజయవంతం

0
52
మరో అద్భుతం చేసిన భారత్ : “నిర్భయ్‌” ప్రయోగం విజయవంతం
మరో అద్భుతం చేసిన భారత్ : “నిర్భయ్‌” ప్రయోగం విజయవంతం

సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి “నిర్భయ్‌”ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. 1000 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని “చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్టు రేంజ్‌” నుంచి విజయవంతంగా ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన ఈ క్షిపణి 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. టర్బోఫ్యాన్‌ లేదా  టర్బోజెట్‌ ఇంజిన్‌తో ఇది ప్రయాణించనుంది. అత్యాధునిక నావిగేషన్‌ సిస్టమ్‌ తో దూసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.