ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : పెరుగుతున్న పోలింగ్ శాతం.. ఎవ‌రికి ప్ర‌యోజ‌న‌మో తెలుసా..?

0
86

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు కొన్ని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్ర‌శాంతంగా జ‌రుగుతుంద‌ని, మ‌రికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య పోలింగ్ కొన‌సాగుతోంద‌ని ఇది వ‌ర‌కే రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ద్వివేది తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే, ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. పోలింగ్ శాతం ఈ సారి పెరిగే అవ‌కాశం ఉంద‌న్న ఆశాభావాన్ని ఎన్నిక‌ల అధికారులు వ్య‌క్తం చేస్తున్నారు. క్రితంసారి 78 శాతం పోలింగ్ శాతం న‌మోదు కాగా, ఈ సారి అది 80 శాతం దాటుతుంద‌న్న ఆశాభావాన్ని ఎన్నిక‌ల అధికారులు వ్య‌క్తం చేస్తున్నారు. ఎంత వ‌ర‌కు పోలింగ్ శాతం చేరుకుంటుంది..? పోలింగ్ శాతం పెరుగుద‌లతో ఏ పార్టీకి ప్ర‌యోజనం క‌లుగుతుందో అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే పోలింగ్ ముగిసే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.