వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీది ఒంట‌రి పోరే..!

0
224

అతి త్వ‌ర‌లో ఏపీ వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీ నేత‌, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, ఇవాళ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు కేంద్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా వాళ్ల మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా, త‌దిత‌ర హ‌క్కుల‌ను సాధించుకునే క్ర‌మంలో త‌మ పూర్తి బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తామ‌న్నారు.

అలాగే, సీఎం చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన‌, వైసీపీ, బీజేపీ పొత్త‌ని మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేవ‌లం ఓట‌మి భ‌యంతోనే సీఎం చంద్ర‌బాబు పొత్తు డ్రామాలాడుతున్నార‌న్నారు. ఆఖ‌రుకు జ‌న‌సేన‌, టీడీపీ మ‌ళ్లీ పొత్తు పెట్టుకున్నా త‌మ‌కు పోయే న‌ష్ట‌మేమీ లేద‌న్నారు. ప్ర‌జా సమ‌స్య‌ల‌పై గ‌త నాలుగున్నారేళ్ల నుంచి పోరాటం చేస్తున్న నాయ‌కులు ఒక్క వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మేన‌న్నారు.