పార్టీ ఆదేశిస్తే మోడీని ఢీకొడ‌తా : ప్రియాంక గాంధీ

0
166

పార్టీ ఆదేశిస్తే మోడీని ఢీకొట్టేందుకైనా రెడీ ఇదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తూర్పు కాంగ్రెస్ కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ చెబుతున్న మాట‌. వార‌ణాసిలో పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ప్రియాంక గాంధీ ప్ర‌క‌టించారు. అయితే, పార్టీ త‌న‌ను ఆదేశిస్తే తేల్చి చెబుతాన‌ని చెప్పారు. ఆమె గ‌త కొన్ని రోజులుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్రాంతాల్లో కాంగ్రెష్ పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వార‌ణాసి నుంచి కాంగ్రెస్ త‌రుపున అజ‌య్ రాయ్ మూడో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ కూడా ఈ స్థానం నుంచి పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో మోడీ ఘ‌న విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌రోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, ఎస్పీ కూట‌మి త‌మ అభ్య‌ర్ధిని ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌లేదు.

అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక‌ల్లో పోటీపై ప్రియాంక గాంధీ గ‌తంలోనూ స్పందిస్తూ త‌మ పార్టీ ఆదేశిస్తూ ఎక్క‌డ్నుంచైనా పోటీకి సిద్ధ‌మ‌ని తెలిపారు. ప్రియాంక గాంధీ ఈ ఎన్నిక‌ల్లో వార‌ణాసి నుంచి పోటీ చేయాల‌ని చాలా మంది కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.