‘రిషభ్ పంత్’ ని కాదని ‘దినేష్ కార్తిక్’ ని అందుకే సెలక్ట్ చేశాము : కోహ్లీ

0
218
world cup 2019

ఈ సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరగబోతున్న ప్రపంచ కప్ ఆటలో ఆడే జట్టును గత నెలలోనే బీసీసీఐ వెల్లడించింది. దీనిలో రెండో వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను కాదు అనేసి .. దినేష్ కార్తిక్ ను సెలెక్ట్ చేయడమేంటని అప్పట్లో పెద్దగా చర్చ జరిగింది. ఈ విషయమై చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అప్పట్లోనే దినేశ్ కార్తీక్ కున్న ఎక్సపీరియన్సు ను బట్టి అతనిని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే తాజాగా ఈ విషయం మీదే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ..” దినేశ్ కార్తీక్ కున్న అనుభవానికి , ఆటలో క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా , ఒత్తిడికి గురైనా ఆడే అంత సత్తా అతనిలో కలదు. ఈ కారణంగానే రిషభ్ పంత్ ను కాదని దినేశ్ ని సెలక్ట్ చేయడం జరిగింది. అందీ కానీ దినేశ్ కార్తీక్ మంచి ఆట గాడు కాదని కాదు. ధోనీ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు… ఏదైనా అనివార్యమైన కారణాలతో ధోనీ మ్యాచ్ లో ఆడలేని పరిస్థితి వస్తే .. అప్పుడు దినేశ్ కార్తీక్ జట్టులోకి తప్పకుండా వస్తాడు .. కార్తీక్ కి మ్యాచ్ ని ఫినిష్ చేయడంలో గుడ్ ట్రాక్ రికార్డ్ ఉంది.” అంటూ తెలిపాడు.