ఐఏఎస్ శ్రీ ల‌క్ష్మీ రీ ఎంట్రీ..!

0
245

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో కేంద్ర స‌ర్వీసుల్లో ప‌క్క రాష్ట్రాల్లో విధులు నిర్వ‌హిస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు సొంత రాష్ట్రానికి వ‌చ్చేందుకు సుముఖ‌త వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ప‌లువురు అధికారులు ఏపీకి వ‌చ్చేందుకు దాదాపు ఖాయ‌మైంది. ఆ క్ర‌మంలోనే తెలంగాణ‌కు చెందిన స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీఎం జ‌గ‌న్ నియ‌మించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.., అయితే, గ‌తంలో జ‌గన్ మోహ‌న్‌రెడ్డిపై న‌మోదైన కేసుల విష‌యంలో ఇబ్బందిప‌డిన అధికారులు కూడా ఇప్పుడు ఏపీలో విధులు నిర్వ‌హించేందుకు సుముఖ‌త చూప‌డం ఆస‌క్తిక‌రంగా ఉంది. ఐఏఎస్ శ్రీ ల‌క్ష్మీ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై కేసుల స‌మ‌యంలో ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె జైలుకు వెళ్ల‌డంతోపాటు ఆరోగ్య‌ప‌రంగాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు ఆమె ఏపీకి వ‌చ్చేందుకు ఎంతో ఆస‌క్తిచూపుతున్నారు. ఏపీకి రావాల‌ని ఉన్న త‌న ఆలోచ‌న‌ను వైఎస్ జ‌గ‌న్‌తో ఆమె ఇప్ప‌టికే చెప్పిన‌ట్టు స‌మాచారం. అందుకు జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించడంతో తాను ఏపీకి వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా ఆమె తెలంగాణ ప్ర‌భుత్వానికి కూడా ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు.