కేంద్ర స‌ర్వీసుల‌కు అమ్ర‌పాలి..!

0
80

ప్ర‌స్తుతం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో విధులు నిర్వ‌హిస్తున్న అమ్ర‌పాలిని కేంద్ర‌స‌ర్వీసుల‌కు పంపాల్సిందిగా తెలంగాణ ఉన్న‌తాధికారుల‌కు వ‌ర్త‌మానం అందింది. దీంతో అమ్ర‌పాలితోపాటు జీహెచ్ఎంసీలో విధులు నిర్వ‌హిస్తున్న మ‌రో ఐఏఎస్ కేడ‌ర్ అధికారి శ‌శికిర‌ణాచారిని కూడా కేంద్ర‌స‌ర్వీసుల‌కు పంపించాల్సిందిగా సమాచారం అందింది.

కాగా, అమ్ర‌పాలి, శ‌శికిర‌ణాచారి ఇద్ద‌రు కూడా కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ.కిష‌న్‌రెడ్డి కార్యాల‌యంలో విధులు నిర్వ‌హించ‌నున్నారు. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చి అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.