ఉపేంద్ర ‘ఐ ల‌వ్ యు’ అరాచ‌కం

0
159

‘ఐ లవ్ యు’ టీజర్ కేక‌.. ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అంటూ కొంద‌రంటుంటే, ఛీ.. ఏంటి మీరీ వ‌ల్గ‌ర్‌గా లేదూ అంటూ మ‌రికొంత‌మంది కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మైన క‌న్న‌డ హీరో ఉపేంద్ర తాజాగా ‘ఐ లవ్ యు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్.చంద్రు స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ద్విభాషా చిత్రం తెలుగు టీజర్‌ను ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ టీజర్ పై సినీ అభిమానులు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

‘మీలాంటి అమ్మాయిలు ఇలాంటి స్టేటస్ చూసే ఈ అబ్బాయిలకు పడతారు కదా. ఫస్టాఫాల్ ఈ స్టేటస్ సంపాదించింది వీడు కాదు. వీడి అబ్బ సంపాదించాడు. నువ్వు పడాల్సింది వీడి అబ్బకి. వీడికెందుకు పడ్డావు’.. ‘అమ్మాయిలకు అబ్బాయిలు కావాలనిపిస్తుంది.. అబ్బాయిలకు అమ్మాయిలు కావాలనిపిస్తుంది. ఇలాంటి మంచింగ్ ప్రోసెస్‌నే ఐ లవ్ యు అంటారు’ అంటూ ఉపేంద్ర చెప్పే డైలాగ్స్ మీద మిశ్ర‌మ స్పంద‌న వ్యక్త‌మ‌వుతోంది. ఈ సినిమాలో రచితా రామ్ హీరోయిన్‌గా నటించింది. సోనూ గౌడ, బ్రహ్మానందం, హోనవల్లి క్రిష్ణ, జై జగదీశ్ ముఖ్య పాత్రలు పోషించారు.

అయితే, ఈ టీజ‌ర్ వ్యూస్ కి మాత్రం లోటుండ‌టంలేదు.. తెలుగు టీజ‌ర్ నెమ్మ‌దిగా దూసుకెళ్తుంటే, క‌న్న‌డ టీజ‌ర్ కేక పెట్టిస్తూ వ్యూస్ సాధిస్తోంది.