హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్‌లో దారుణం..!

0
199

హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. ఇందిరాగాంధీన‌గ‌ర్‌పురం బస్తీలో నివాసం ఉండే రేణుక నాంప‌ల్లి పోస్టు ఆఫీసులో కాంట్రాక్ట‌ర్ స్వీప‌ర్‌గా ప‌నిచేస్తోంది. భ‌ర్త కృష్ణ బ‌హుదూర్‌పురాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పెయింట‌ర్‌గా ప‌నిచేసేవాడు.  రోజూ మ‌ద్యం తాగొచ్చి భార్య‌తో గొడ‌వ‌ప‌డి తీవ్రంగ కొట్టేవాడు. భ‌ర్త‌తోపాటు అత్త రేణుకను దారుణంగా కొట్టి చంపి ఇంట్లో ప‌డేశార‌ని మృతురాలి కుమార్తెలు తెలిపారు.

భ‌ర్తే చంపి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని కుమార్తెలు ఆరోపిస్తున్నారు. భార్య‌ను చంపి ప‌రారైన కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణుక మృతి విష‌యంలో ఎవ‌రెవ‌రి ప్రమేయం ఉందన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌న్నారు.