కూక‌ట్‌ప‌ల్లిలో విషాదం..!

0
113

క్ష‌ణికావేశం ప్రాణం తీసింది. ఫంక్ష‌న్‌కు వెళ్లే విష‌య‌మై భ‌ర్త‌తో జ‌రిగిన గొడ‌వ‌లో మ‌న‌స్తాపానికి గురైన ఓ భార్య తన కుమార్తెతో క‌లిసి బిల్డింగ్‌పై నుంచి దూకింది. త‌ల్లికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. కుమార్తె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

కూక‌ట్‌ప‌ల్లి బాలాజీన‌గ‌ర్‌కు చెందిన రామ్మూర్తికి, భార్య ప‌ద్మ‌జ‌తో గొడ‌వ జ‌రిగింది. అదే స‌మ‌యంలో ఆవేశంలో ఉన్న ప‌ద్మ‌జ త‌న రెండేళ్ల కుమార్తె అక్ష‌ర‌తోపాటు బిల్డింగ్‌పై నుంచి దూకింది. పోలీసులు కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.