బిగ్‌బ్రేకింగ్ : రాహుల్ గాంధీ రాక‌తో.. హుటా హుటిన బ‌య‌ల్దేరిన చంద్ర‌బాబు..!

0
472

కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకంగా చేస్తున్న సీఎం చంద్ర‌బాబు ఆయా పార్టీల త‌రపున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే, రెండో విడ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు డీఎంకేకు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతోపాటు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. అలాగే క‌ర్నాట‌క‌లో జేడీఎస్ త‌రుపున మాండ్యాలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఇదిలా ఉండగా, సీఎం చంద్ర‌బాబు ఈ రోజు క‌ర్ణాట‌క‌లో మ‌ళ్లీ ప్ర‌చారం నిర్వ‌హించనున్నారు. క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్‌లో జేడీఎస్ అభ్య‌ర్ధుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ, క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామితో క‌లిసి సీఎం చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తారు.