చ‌రిత్ర సృష్టించిన అమెజాన్ సీఈవో స‌తీమ‌ణి..!

0
108

అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ స‌తీమ‌ణి చ‌రిత్ర సృష్టించింది. అయితే, జెఫ్ బెజోస్ ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడిగా పేరుపొందిన సంగ‌తి తెలిసిందే. అతని నికర ఆస్థి విలువ 137మిలియన్ డాలర్లు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న, ఆయ‌న‌ స‌తీమ‌ణి మెకంజీ విడాకులు తీసుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారిద్ద‌రూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

కొన్ని నెలలు విడిగా ఎలా ఉండగలం అనేది ప్రయోగాత్మకంగా చూశాం. కానీ, విడిపోయాక కూడా స్నేహితులుగా ఉండగలమన్న‌ నమ్మకం కుదిరింది. ఆ క్ర‌మంలోనే చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని అనుకున్నామ‌ని స‌తీమ‌ణి మెకంజీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అయితే, విడాకులు తీసుకోవ‌డంతో జెఫ్ బెజోస్ తన ఆస్తిలో దాదాపు సగం స‌తీమ‌ణి మెకంజీ భ‌ర‌ణంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని విలువ దాదాపు 62 బిలియన్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.4.2 లక్షల కోట్లన్న‌మాట‌. ప్ర‌పంచంలోనే ఇంత భారీ మొత్తంలో మ‌నోవ‌ర్తి తీసుకున్న మొదటి మహిళగా మెకంజీ చ‌రిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ భరణం ద్వారా ఆమె ప్రపంచలోనే అత్యధిక సంపన్నురాలైన మహిళకానున్నారు.