కీచక గురువు నిజస్వరూపం పట్టబయలు : యాక్టింగ్ పేరుతో అమ్మాయిల పట్ల అసభ్య ప్రవర్తన

0
198
కీచక గురువు నిజస్వరూపం పట్టబయలు : యాక్టింగ్ పేరుతో అమ్మాయిల పట్ల అసభ్య ప్రవర్తన
కీచక గురువు నిజస్వరూపం పట్టబయలు : యాక్టింగ్ పేరుతో అమ్మాయిల పట్ల అసభ్య ప్రవర్తన

ఎన్నో ఏళ్లుగా హిమాయత్ నగర్ లో యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న “వినయ్” అనే వ్యక్తి అసలు బాగోతం బయటపడింది. వినయ్ తన దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చిన అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే వార్త చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికి వస్తే.. “నా దగ్గరా నటన నేర్చుకోవాలి అంటే ముందు మీరు బట్టలు విప్పి నగ్నంగా కనిపించాలి” అని కండిషన్ పెడతాడు.

అలా అని వచ్చిన మొదటిరోజే చెప్పాడు.. రాగానే తనకు కావల్సిన ఫీజు తీసుకొని… రెండు వారాలపాటు చిన్న చిన్న ట్రైనింగ్ ఇస్తాడు. రెండు వారాల తరువాత ఒకరోజు రూమ్ లో ఉన్న అన్నీ కిటికీలు, డోర్లు మూసివేసి బట్టలు విప్పి నగ్నంగా ఉండమని చెబుతాడు. ఇది కావాలని చెబుతున్నా అసత్యం కాదు.. అతడి చేతిలో మోసపోయిన ఒక మహిళా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న నగ్న సత్యం. ఇక్కడా విచిత్రం ఏంటంటే “బట్టలు విప్పమన్నది నిజమే” అని నింధితుడు ఒప్పుకోవడం.

అతడు చెప్పిన మాటలని ఒక్కసారి పరిశీలిస్తే.. అవును బట్టలు విప్పమన్నాను.. కానీ కిందా, మీద మొత్తం విప్పమని చెప్పలేదు.. కేవలం పై వస్త్రం మాత్రమే తీసేయమన్నాను.. నా దగ్గర నటన నేర్చుకునే ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తారు. ఇప్పటివరకు చాలా మంది అమ్మాయిలు అలా చేసే నా దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు అని మొహమాటం లేకుండా చెప్పాడు.

కానీ అది నటనలో ఒక బాగం అంటాడు వినయ్.. నటన నేర్చుకోవాలి అని వస్తే.. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని అనే విషయాన్ని పక్కన పెట్టి ఓపెన్ గా ఉండాలట. లేదంటే నటన రాదు అంటాడు ఆ పెద్దమనిషి. మరీ అతడు చేస్తున్న ఈ పిచ్చి పనికి పోలీసులు ఎలాంటి శిక్ష వేస్తారో చూడాలి.