వైద్యులే ఆశ్చర్యపోయేలా.. రోగి కడుపులో ఇనుప దుకాణం ..!

0
212

డాక్టర్స్ సైతం ఆశ్చర్యపోయేలా… ఓ వ్యక్తి కడుపులో ఇనుప వస్తువుల చిల్లర కొట్టే కనిపించింది. ఏంటి ఇది నమ్మే నిజమేనా ? అతని కడుపులో ఉన్న ఆ వస్తువులేంటి? ఇది నమ్మ సఖ్యంగా లేదంటారా? అయితే నాతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆ ఆసుపత్రికి రండి.. ఏం జరిగిందో అక్కడి వైద్య బృందాన్ని అడిగి తెలుసుకుందాము..

హిమాచల్ ప్రదేశ్ లోని మండీ ప్రదేశానికి చెందిన 35 సంవత్సరాల వయస్సు గల కరణ్ సేన్ కి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేర్చారు. మండి లోని లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ లో చేర్చిన అనంతరం వైద్య పరీక్షల మేరకు అతని కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వైద్య బృందం సైతము దిగ్బ్రాంతికి గురికాగా, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. మానసిక రోగికి ఆపరేషన్ చేసిన తర్వాత అతడి ఉదరం నుంచి స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, టూత్ బ్రష్షులు, కిచెన్ నైఫ్ వస్తువులను బయటకు తీశారు. మానసిక వ్యాధి గ్రస్తుడు కావడంతో అతను ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఇనుప వస్తువులను మింగి ఉంటాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి కరణ్ సేన్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.