తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో లోపాల వెనక అసలు రహస్యం ఏంటి.. ?

0
262
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో లోపాల వెనక అసలు రహస్యం ఏంటి.. ?
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో లోపాల వెనక అసలు రహస్యం ఏంటి.. ?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో “తెలంగాణ ఇంటర్‌ బోర్డు” వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. విద్యార్థుల పరీక్ష ఫలితాలు అంటే వారి భవిష్యత్ ఫలితాలు.. కాబట్టి ఫలితాల్లో ఏ చిన్న తప్పు జరిగిన ఆందోళన చెందుతారు. అందులోనూ తెలిసి తెలియని వయసులో ఉండే ఇంటర్ విద్యార్థుల పరిస్థితిని అంచనా వేయలేము. ఇలాంటి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్.. ఫలితంగా విద్యార్థుల వరస ఆత్మహత్యలు.. ఇప్పటికే 16 నుండి 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తుంది.

అసలు ఏం జరిగింది ? ఇంటర్ బోర్డ్ చేసిన నేరం ఏంటి ? ఫలితాల విడుదల వ్యవహారాన్ని “గ్లోబరీనా సంస్థ” కు అప్పగించడమే ఇంటర్ బోర్డ్ చేసిన తప్ప ? లేక రాజకీయంగా ఏమైనా అవకతవకలు జరిగాయా ? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఒక్కసారి ఏం జరిగింది అనేది చూస్తే.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్హుల ఫలితాలకంటే తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఫలితాల విషయంలో ఆలస్యం జరిగింది.

అప్పుడే ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. దీని కారణంగానే ఏం చేయాలో అర్దం కానీ “తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్” ఫలితాల విడుదలను ఆలస్యం చేస్తుందని పుకార్లు వినిపించాయి. కానీ అవి కేవలం పుకార్లు మాత్రమే అందులో వాస్తవం లేదు అని వివరణ ఇచ్చింది ఇంటర్ బోర్డ్. కానీ ఫలితాల విడుదల తరువాత అవి పుకార్లు కావు నిజాలే అని స్పష్టంగా అర్దం అయ్యింది. అన్నీ తెలిసిన బోర్డ్ సెక్రెటరీ అశోక్.. ఏం తెలియనట్లు మీడియా ద్వారా ఫలితాలాను విడుదల చేసి సైలెంట్ అయిపోయాడు.

అలా కాకుండా ఫలితాల విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని.. 100శాతం అని చెప్పడం లేదు కానీ.. ఏ 20 శాతమో, 30 శాతమే జరిగాయని ముందే ఒప్పుకొని ఉంటే ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్లు కాదు. కానీ అలా చెబితే బోర్డ్ చేతగానితనం బయటపడుతుంది. అలా కాకుండా “మా ఫలితాల్లో తప్పులు జరిగాయి” అని ముందుకొచ్చిన విద్యార్థుల నుండి “రీ కౌంటింగ్” అప్లికేషన్ తీసుకొని వారి సమస్యను పరిస్కరిస్తే మనకు సమస్య ఉండదు.. లేదంటే అందరి జవాబు పత్రాలను మళ్ళీ దిద్దాల్సి వస్తుంది..

దానివల్ల సమయం వృదా అవ్వడమే కాకుండా ఇంటర్ బోర్డ్ పరువు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది అని ఆలోచించారో ఏమో గాని సైలెంట్ గా ఫలితాలు విడుదల చేసి చేతులు దులుపుకుంది ఇంటర్ బోర్డ్. ఫలితాలు విడుదల అయ్యాయో లేదో మేము నిజంగానే ఫెయిల్ అయ్యమా ? బాగానే రాసమే ? ఇంత తక్కువ మార్కులు రావడం ఏంటి ? అని మనస్తాపానికి గురైన కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి బాధ్యులు ఎవరు ? ఎందుకు నిజం తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారు ? అని ఇంటర్ బోర్డ్ అధికారులను ప్రశ్నిస్తే చివరికి నిజాన్ని ఒప్పుకున్నారు.

నిన్న మీడియా ముందుకు వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రెటరీ అశోక్ మాట్లాడినా మాటలు బట్టి చూస్తుంటే.. “గ్లోబరీనా సంస్థ” చేతగాని తనంగానో, ఇంటర్ బోర్డ్ చేసిన తప్పుల కారణంగానో ఫలితాల విషయంలో అవకతవకలు జరిగాయని స్పష్టంగా అర్దం అయ్యింది. అలాంటప్పుడు జరిగిన అసలు నిజాన్ని ముందే ఎందుకు చెప్పలేదు..? పిల్లల భవిష్యత్ అంటే అంత చులకన ఎందుకు ? వాళ్ళు చేసిన నేరం ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు విధ్యా సంఘాల నేతలు.

ప్రస్తుతం అందుతున్న సంచారం ప్రకారం.. ఇక్కడ ఒక “గ్లోబరీనా సంస్థ” తప్పు మాత్రమే లేదు.. ఇంటర్ బోర్డ్ అధికారుల తప్పులు కూడా ఉన్నట్లు స్పష్టంగా అర్దం అవుతుంది. ఒక టీచర్ ఒక్క రోజులో 30 పేపర్ లకు మించి దిద్దకూడదు.. కానీ ఈసారి మాత్రం ఎన్నడూ లేని విదంగా ఒక్కో టీచర్ తో 45 నుండి 60 పేపర్లు దిద్దించారని తెలుస్తుంది. ఈ కారణంగానే 99 మార్కులు వేయాల్సిన పిల్లలకు 0 మార్కులు వేశారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల జీవితాలపై ఇంత నిర్లక్ష్యం వహించిన కే‌సి‌ఆర్ ప్రభుత్వం వివరణ ఇవ్వడమే కాకుండా.. మాకు సరైన న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

                                                                                      ప్రమోద్ మోత్కుపల్లి