కైరాని పట్టించుకోని హీరోలు..

0
176

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ సంపాదించినా, ఒక్క ఫ్లాప్ హీరో హీరోయిన్ల జాతకాలూ మార్చేస్తుంది. అలాంటి ఫ్లాప్ లిస్ట్ లో చేరింది ఓ కథానాయిక . నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్ అంటే మొదటగా ఆ అమ్మడి పేరు వినిపించేది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, మరి నెక్స్ట్ ఏమిటీ అని అడిగితె సమాధానం దొరకడం లేదనే చెప్పాలి. అందుకే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి బిస్తరు కట్టినట్లుంది. టాలీవుడ్ నయా స్టార్ హీరోయిన్స్ లలో కైరా అద్వానీ ఒకరు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామ “భరత్ అనే నేను” లో మహేష్ పక్కన ఛాన్స్ రావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. భరత్ అనే నేను విడుదల కాకుండానే వినయవిధేయరామా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటించే అవకాశం కొట్టేసింది.

ఏ స్టార్ హీరో సినిమా మొదలైన హీరోయిన్ గా ఈ అమ్మడు పేరు వినిపించేంతగా పాపులర్ అయింది. భరత్ అనే నేను విడుదల కాకుండానే మరో సినిమా అవకాశం మెగా పవర్ స్టార్ పక్కన కొట్టేసింది కైరా. వినయవిధేయరామా లో రామ్ చరణ్ కి సరైన జోడీగా నటనతో అభిమానులను మెప్పించింది. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.  ఈ సినిమా విడుదల అయి ఇన్ని రోజులైనా మరో అవకాశం దక్కలేదన్నట్లే కనిపిస్తుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తీస్తున్న RRR సినిమాలో  హీరోయిన్ గా కైరా అద్వానీ పేరు వినిపించిన ప్రస్తుతం ఆ ఊసే లేదు. వినయవిధేయరామా ఫ్లాప్ కావడంతో కైరా కెరీర్ ని  తలక్రిందులు చేసింది. ఇప్పుడు తెలుగు లో ఒక్క అఫర్ కూడా లేని ఈ భామ, ఉంటే హిందీలో మాత్రం రెండు చిత్రాలతో బిజీగా ఉంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ గా రూపు దిద్దుకుంటున్న కబీర్ సింగ్ లో నటిస్తుంది. అలాగే గుడ్ న్యూస్ అనే మరో మూవీ లో నటిస్తుంది. మరి తెలుగు లో ఏ హీరో పిలిచి అవకాశం ఇస్తాడో చూడాలి.