నేను సేఫ్‌ : వ‌రుణ్ తేజ్‌

0
86

టాలీవుడ్ న‌టుడు వరుణ్ తేజ్‌కు తృటిలో ముప్పుత‌ప్పింది. ఆయ‌న‌ హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్తుండ‌గా కారు ప్ర‌మాదానికి గురైంది. NH 44 నేష‌న‌ల్ హైవేలో ఈ ఘ‌న‌ట చోటు చేసుకుంది. వ‌రుణ్ కారు మాత్రం స్వ‌ల్పంగా డామేజ్ కాగా, ఆయ‌న మాత్రం ఎలాంటి గాయాలూ కాకుండా బ‌య‌ట‌ప‌డ్డారు. వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త కోట మండ‌లంలోని రాజీ పేట ద‌గ్గ‌ర‌ వ‌రుణ్ కారు డివైడ‌ర్‌ని ఢీ కొట్టుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

అనంత‌రం వ‌రుణ్ బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై వ‌రుణ్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లో స్పందించారు. అదృష్ట‌వ‌శాత్తూ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డామ‌ని ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేద‌ని, మీ అంద‌రి ఆద‌రాభిమానాల‌కు కృత‌జ్ఞ‌త‌లంటూ వ‌రుణ్ పేర్కొన్నారు.