సాయి ధ‌ర‌మ్ తేజ్ : అమ్మ నాన్న విడాకులు తీసుకోవ‌డంపై క్లారిటీ..!

0
242

పోసాని కృష్ణ ముర‌ళీని క‌లిసిన ప్ర‌తీసారి త‌న నాన్న‌తో మాట్లాడిన ఫీలింగ్ వ‌చ్చేద‌ని టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ చెప్పారు. కాగా సాయి ధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన చిత్ర‌ల‌హ‌రి చిత్రం విడుద‌లై థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో క‌లెక్ష‌న్‌ల‌ను మ‌రింత పెంచుకునేందుకు చిత్ర బృందం మ‌రింత దృష్టి పెట్టింది. ఆ క్ర‌మంలోనే చిత్ర‌ల‌హ‌రి న‌టీన‌టులు ప‌లు ప్ర‌ముఖ మీడియా ఛానెళ్ల‌కు వ‌రుస ఇంట‌ర్వ్యూల‌ను ఇచ్చేస్తున్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. పోసానిని క‌లిసిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ మా నాన్న కూడా ఇలా మాట్లాడ‌తాడేమో.., మా నాన్న ఇలా మాట్లాడితే బాగుంటది.., అలా ఫీలై చిత్ర ల‌హ‌రి స‌న్నివేశాల్లో న‌టించిన‌ట్టు సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పుకొచ్చారు. అలా చేశాను కాబ‌ట్టే అన్ని స‌న్నివేశాలు కూడా రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌న్నారు.

ఇదే సంద‌ర్భంలో ఇంట‌ర్వ్యూయ‌ర్ క‌లుగజేసుకుని అమ్మా నాన్న విడాకులు తీసుకున్నార‌న్న విష‌యం నాకు ఇప్పుడే తెలిసింది.., ఎప్పుడు అయింది..? ఎలా జ‌రిగింది.? అని ప్ర‌శ్నించ‌గా, ఒక్క‌సారిగా క‌ళ్లు చెమ‌ర్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇద్ద‌రూ విడాకులు తీసుకుని దాదాపు 20 సంవ‌త్స‌రాలు అయిపోయింద‌ని, ఇప్ప‌టికీ ఇద్ద‌రితో త‌న రిలేష‌న్ బాగానే ఉంటుంద‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్ తెలిపారు. త‌న లైఫ్‌లో అమ్మే నాన్న‌.. నాన్నే అమ్మ అంటూ త‌న ఇంట‌ర్వ్యూను ముగించేశారు.