ప‌వ‌న్‌ని చూస్తే జాలేస్తోంది -రాజ‌శేఖ‌ర్‌

0
146

ఆం​ధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు సినీన‌టుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్. జగన్ గెలుస్తాడని ముందే తెలుసన్న ఆయ‌న‌, జగన్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు.

‘మా’ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు త‌మ‌కు ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇస్తూ ఇలాంటి వార్త‌లు నిజం కాద‌న్నారు. ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదని స్ప‌ష్టం చేశారు. రెండుజోట్లా పవన్ కళ్యాణ్ ప‌రాజ‌యం పొంద‌డంపై జాలి వేసింది.. ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేదని రాజశేఖర్‌ అన్నారు.