నితిన్‌తో ర‌ష్మిక న్యూజ‌ర్నీ

0
224

నితిన్, రష్మిక మందాన హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా ‘భీష్మ’. ‘ఛ‌లో’ ఫేమ్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఉదయం 10 : 19 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభించి, డిసెంబర్ లో ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ లు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. పి.డి .వి. ప్రసాద్ సమర్పిస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం.