హీరో బాలకృష్ణ చిన్నపిల్లాడు : విజయశాంతి

0
416

సినీ హీరో బాలకృష్ణ ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్ధం కాదు.. అటువంటప్పుడు ప్రజలకు ఇంకేం అర్ధమవుతుంది..? బాలకృష్ణ మాట్లాడే ప్రతిసారి తనకు చిన్నపిల్లలు మాట్లాడినట్టే అనిపిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేసారు.

Read Also: లక్షీ పార్వతిని కొట్టడంపై పురందేశ్వరి క్లారిటీ..!

బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి మీ కామెంట్ ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఏ రెండు సినిమాలను తాను చూడలేదని విజయశాంతి చెప్పారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున చూడలేక పోయానన్నారు. అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విజయశాంతి అన్నారు.