హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం.. ఉరుముల‌తో కూడిన ఈదురుగాలులు

0
80

భానుడి ప్ర‌తాపానికి మ‌ల‌మ‌లామాడిపోతోన్న భాగ్య‌న‌గ‌ర‌వాసుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది. మంగ‌ళ‌వారం రాత్రి ఏడున్న‌ర గంట‌ల నుంచి ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షం కురిసింది. కుండ‌పోత వ‌ర్షంతో పాటు, భారీగా ఈదురుగాలు వీశాయి. ఉరుములు, మెరుపుల‌తో కురిసిన భారీ వ‌ర్షానికి ప‌లు చోట్ల విరిగిప‌డ్డాయి. హోర్డింగులు ఎగిరి ప‌డ్డాయి.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట‌, అమీర్ పేట్, మ‌ణికొండ‌, మెహ‌దీప‌ట్నం, మ‌ణికొండ, సికింద్రాబాద్, త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం ప‌డింది. భారీ వ‌ర్షం కార‌ణంగా ప‌లుప్రాంతాల్లో భారీ గా ట్రాఫిక్ జామ్ అయింది. ప‌లుచోట్ల విద్యుత్ ప్ర‌సారానికి అంత‌రాయం ఏర్ప‌డింది. సోమ‌వారం కూడా సిటీలోని ప‌లుప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే.