టార్చర్ అంటే ఏంటో చూపించాడు.. సింగర్ మాళవిక సంచలన వ్యాఖ్యలు ..!

0
401
malavika
malavika latest news

ఈ టీవీ లో పాడుతా తీయగాలో ఫైనల్ లిస్ట్ గా నిలచిన సింగర్ మాళవిక. ఆ తరువాత మాళవికకు అవకాశాలు ముంగిట్లో వాలాయి. తెలుగు పరిశ్రములో ఎన్నో పాటలు ఆలపిస్తూ ప్రేక్షకుల మదిని దోచేస్తుంది. మాళవిక ఈ మధ్య ఒక టీవీ కార్యక్రమానికి హాజరయ్యారు. మాళవికకు ఎదురైనా చేదు అనుభవాన్ని వివరించమని యాంకర్ అడగగా.. తనకు తలెత్తిన ఒక సమస్యను వివరించారు. మాళవిక మాట్లాడుతూ ‘గత కొంత కాలం క్రితం సినీ రంగంలో కెమెరా డిపార్ట్ మెంట్ కు సంబందించిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు ఒకతను. ప్రతి రోజు ఫోన్ చేస్తూ విసిగించేవాడు… నిజం చెప్పాలంటే టార్చర్ అంటే ఏంటో చూపించాడు. విపరీతమైన ఫోన్స్, మెసేజెస్ చేస్తుండేవాడు. దాదాపుగా  అమ్మే నా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కి సంబందించిన ఫోన్స్ మాట్లాడి షెడ్యూల్ ప్రిపేర్ చేసేది. నాతో పాటు అమ్మ కూడా ప్రోగ్రామ్స్ కి తోడుగా వచ్చేది. ఈ పరంగానే అతని ఫోన్ అమ్మే ఎన్నో సార్లు లిఫ్ట్ చేసి హెచ్చరించింది. కానీ అతను మాత్రం చికాకు తెప్పిస్తూ పదే పదే ఫోన్ చేస్తుండేవాడు.

కొన్ని రోజుల పాటు అలాగే కొనసాగింది. అతనితో గొడవెందుకని మేము కామ్ గా ఉన్నాము. అంతే ఇక అతను ఇంకా ఎక్కువగా రెచ్చిపోయాడు. రోజు ఫోన్స్, మెసేజెస్ చేస్తుండేవాడు. ఒకసారి ఈవెంట్ చేయడానికి నేను, సహా గాయని గీతామాధురి, నటుడు శివారెడ్డి, అభినయ్‌ కృష్ణ వెళ్ళాము. ఆ సమయాన ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది. ఇదివరకు చనిపోయిన వ్యక్తుల జనన, మరణాల తేదీలను రాస్తూ పంపాడు. చివర్లో నీ డెత్ డే ఎప్పుడో మీకు తెలుసా అని పంపాడు. అంతే ఇక నాకు చాలా భయం వేసింది వెంటనే శివారెడ్డి, అభినయ్‌కృష్ణ లకు ఎస్సెమ్మెస్ ను చూపించాను. వాళ్ళు అతనికి ఫోన్ చేసి ‘డీఎస్పీని  మాట్లుడుతున్నాను.. మాళవిక కేసు పెట్టిందని’ గట్టిగా బెదిరించారు. ఇక ఆరోజు నుంచి నాకు అతను నుంచి ఎలాంటి కాల్ రాలేదు’ . అని మాళవిక వివరించింది.