సైకో శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లో అమ్మాయిల ఫోటోలు : భయంకర నిజాలు

0
306
hazipur srinivas reddy latest news

హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి గురించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తుంది. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అతడు చేసే పని కంటే అమ్మాయిల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టే వాడని తెలుస్తుంది. గత ఐదు రోజులుగా సుదీర్ఘ విచారణ చేస్తున్న పోలీసులకు భయంకర నిజాలు తెలుస్తున్నాయి. విచారణలో భాగంగా శ్రీనివాస్ రెడ్డి ఫోన్ సీజ్ చేసిన పోలీసులు అతడి ఫోన్ లోని డేటా చెక్ చేశారు. అందులో అమ్మాయిల ఫోటోలు తప్ప ఏమీ కనిపించలేదు పోలీసులకు.

దాంతో ఈ అమ్మాయిలు ఎవరు ?ఏం చేస్తుంటారు ? వాళ్ళ ఫోటోలు నీ ఫోన్లో ఎందుకు ఉన్నాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అందుకు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే. ఎలాంటి పని లేని శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడూ ఫేస్ బుక్, ట్విట్టర్ అంటూ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తుంటాడు అలాంటి శ్రీనివాసరెడ్డి అందమైన అమ్మాయిల ఫోటోలు కనిపిస్తే చాలు వాటిని తన ఫోన్లో సేవ్ చేసుకుంటాడు. అలా ఆయన ఫోన్లో కొన్ని వేల ఫొటోస్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిలు ఎవరు అని ఆరా తీయగా ఫేస్ బుక్ లో నుండి డౌన్లోడ్ చేశానని సమాధానం ఇచ్చాడట శ్రీనివాస్ రెడ్డి.