బయ్యర్ల పై భయమా? వినయమా?

0
169

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ ఇటీవల రూపొందింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను మన్నన పొందలేకపోయింది. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో నిర్మించిన ఈ సినిమా, ఆశించినంతగా అందిపుచ్చుకోలేకపోయింది. దాంతో అభిమానుల అంచనాలను చొరగొనలేకపోయామని, చరణ్ ఒక ప్రెస్ నోట్ ను కూడా తాజాగా విడుదల చేశాడు.

ఈ సినిమాతో బయ్యర్లు 30 కోట్ల రూపాయల వరకూ నష్టం పొందారట. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా పూడ్చాల్సిన అవసరం, బాధ్యత తమకెంతో ఉందని చరణ్ అనుకున్నాడట. అంతటితో తన అభిప్రాయాన్ని నిర్మాత దానయ్యకు చరణ్ వ్యక్త పరిచాడట. దానయ్య కూడా చరణ్ మాటలకూ స్పందించి ఓకే అన్నారు. దాంతో వారిద్దరూ ఏకమై 15 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని ఏకాభిప్రాయానికి వచ్చారని వార్తలు బయటకొచ్చా యి.

ఈ సినిమాకి కోసం చరణ్ తీసుకున్న పారితోషికము నుండి 5 కోట్లను రూపాయలను తిరిగి ఇవ్వాలని సంసిద్ధతను వ్యక్తం చేసాడని సమాచారం. ఇక మిగిలిన 10 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసుకునే దిశగా దర్శక నిర్మాతల మద్య చర్చలు జరుగుతున్నాయట. మొత్తం డబ్బులు కాగానే బయ్యర్లుకు తిరిగి ఇస్తారని వినికిడి.