మెగాస్టార్ చిన్నల్లుడుకి వేధింపులు

0
182

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కారు. గత కొన్నిరోజులుగా ఇన్స్టాగ్రామ్ లో కొందరు తనను వేధిస్తున్నారని క‌ళ్యాణ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. పదిమంది వరకు గుర్తు తెలియని వ్యక్తులు తరచూ తనపైన‌, తన కుటుంబంపైనా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వేధిస్తున్నారని కళ్యాణ్ దేవ్ పోలీసుల‌కు వెల్ల‌డించారు.

ఈ ఫిర్యాదుపై అద‌న‌పు డీసీపీ ర‌ఘువీర్‌ స్పందించారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల ఇన్స్టాగ్రమ్ ఐడీలను గుర్తించామని, వారి పూర్తి వివరాల కోసం ఇన్స్టాగ్రమ్ సిబ్బందిని సంప్రదించామని, పూర్తి వివరాలు అందగానే సదరు వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని ఆయ‌న చెప్పారు.