అందుకే చంద్ర‌బాబు విజ‌యం.. !

0
184

ఈనెల 14వ తేదీన ఏపీ కేబినెట్ స‌మావేశం త‌ధ్య‌మంటూ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఎన్నికల కోడ్ సాకుగా చూపి ఎవ‌రాపుతారో చూస్తానంటూ స‌వాల్ కూడా చేశారు. ఏపీ సీఎస్ తో చంద్ర‌బాబుకు విభేదాల కార‌ణంగా ఈ అంశం అంద‌రి ద‌ష్టిని ఆక‌ర్షించింది. తాజా ప‌రిణామాల ప్ర‌కారం చంద్ర‌బాబు మాటే చెల్లుబాట‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే, స‌మావేశంలో చ‌ర్చించాల్సిన అంశాల ప్ర‌భావం ఆధారంగానే అనుమ‌తులు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్రంలో ఫణీ తుఫాను ప్రభావం, తాగునీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉఫాది హామీ కూలీల ఇబ్బందులపై చర్చించేందుకు కేబినెట్ సమావేశమవుతుందని స్క్రీనింగ్ కమిటీకి సీఎంవో సమాచారం ఇచ్చింది. ఈ అంశాలపై చర్చించిన స్క్రీనింగ్ కమిటీ అజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదించింది.

ఈ విషయాన్ని సీఎస్, సీఈవో ద్వివేదికి తెలియజేశారు. ఈ నివేదికను సీఈవో ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు. సీఈసీ నుంచి అనుమతి వస్తే ఈ నెల 14న కేబినెట్ సమావేశమవుతుంది.