ఏపీ సెన్షేష‌న్ : వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
656

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న గ్రంధి శ్రీ‌నివాస్ ఈ ద‌ఫా జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా బ‌రిలో నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓడించారు.

అలా స్వ‌యాన ఒక ప్ర‌ధాన పార్టీ అధ్య‌క్షుడినే ఓడించ‌డంతో గ్రంథి శ్రీ‌నివాస్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అంద‌రి నోళ్ల‌లో నానుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓడించిన గ్రంథి శ్రీ‌నివాస్‌కు వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి కేటాయించ‌డం క‌న్ఫామ్ అని అంద‌రూ భావించారు. కానీ జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌లేదు.

ఇదే విష‌య‌మై గ్రంథి శ్రీ‌నివాస్‌ను ప‌ల‌క‌రించిన మీడియా ప్ర‌తినిధుల‌కు ఆయ‌న స్పందించారు. సామాజిక కోణాల నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ త‌న‌కు మంత్రి ప‌ద‌విని కేటాయించ‌లేక‌పోయార‌ని చెప్పుకొచ్చారు. సీఎం జ‌గ‌న్ త‌న‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించినా, కేటాయించ‌కున్నా 2024లో వైసీపీ విజ‌య‌మే ల‌క్ష్యంగా త‌న ప‌నిత‌నం ఉంటుంద‌ని తెలిపారు. త‌న తుది శ్వాస వ‌ర‌కు వైసీపీలోనే కొన‌సాగుతాన‌ని గ్రంధి శ్రీ‌నివాస్ చెప్పారు.