ఎనిమిది మంది ప్ర‌భుత్వ అధికారుల అరెస్టు..!

0
117

ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వప‌ర సేవ‌లు అందించేందుకు నియ‌మించిన అధికారులు బ‌ల్ల‌కింద చేయి చాచ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ ఖ‌జానాకే క‌న్న‌మేశారు. లెక్క‌లు చూసే క్ర‌మంలో ఆ విష‌యం కాస్తా బ‌య‌ట ప‌డింది. దీంతో అడ్డ‌దారులు తొక్కిన అధికారుల చేతుల‌కు సంకెళ్లేసి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చోబెట్టారు. ఈ సంఘ‌ట‌న ఆదిలాబాద్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
2014 -2018 కాలంలో రూ.78ల‌క్ష‌ల ఖ‌జానాకు జ‌మ కాలేదు. దీనిపై అప్ప‌ట్లో ప‌లు మీడియా ఛానెళ్లు వ‌రుస క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయి. పూర్తి విచార‌ణ జ‌రిపిన అదికారులు స‌బ్ రిజిస్ట్రార్స్‌గా ప‌నిచేసిన వారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఆ త‌రువాత పోలీసులు కేసు న‌మోదు చేసి గ‌తంలో న‌లుగురిని, తాజాగా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.