ప్రయాణీకులకు శుభవార్త

0
176

హైదరాబాద్ ప్రయాణీకులకు ఇది ఒక శుభవార్త. నేటి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మెట్రో రైలు స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో మొత్తం 50 మెట్రో స్టేషన్లు వినియోగంలోకి వచ్చినట్టు అయింది. తాజా చెక్‌పోస్టు స్టేషన్ వల్ల ఫిలింనగర్‌, జర్నలిస్ట్‌కాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాళ్‌నగర్‌, గాయత్రిహిల్స్‌, చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు చుట్టుపక్కల కాలనీలవాసులకు మెట్రోరైలు సేవలు మరింత చేరువలోకి వచ్చినట్టు అయిందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేషన్లలో టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫాం రెండూ ఒకే చోట ఉండడం విశేషం. కాగా, మార్చి 20నే అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గం అందుబాటులోకి వచ్చినప్పటికీ సైబర్ టవర్స్ దగ్గర రైలు ట్రాక్ మారే సదుపాయం లేకపోవడంతో చెక్‌పోస్టు వరకు వెళ్లిన మార్గంలోనే రైళ్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వేళలు సర్దుబాటు కావడం ఇబ్బందిగా మారడంతో ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు.