జ‌గ‌న్ సీఎంగా.. ఏపీకి మ‌రో గుడ్ న్యూస్‌..!

0
408

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా క‌థ‌నాల‌ను ప్ర‌చురించే ఓ ప్ర‌ముఖ దిన ప‌త్రిక మంగ‌ళ‌వారం నాడు ఒక ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అయితే, ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మిని చ‌విచూసిన నేప‌థ్యంలో ఉండ‌వ‌ల్లిలోని మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటికి ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు భారీ సంఖ్య‌లో రాక‌పోక‌ల‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అలా చంద్ర‌బాబు రాక‌పోక‌ల‌ను కొన‌సాగిస్తున్న వారిలో యువ‌కులు కూడా అధిక సంఖ్య‌లోనే ఉన్నారు. చంద్ర‌బాబును క‌లిసిన కొంద‌రు యువ‌కులు మాత్రం చంద్ర‌బాబుతో మాట్లాడుతూ మీరు ముఖ్య‌మంత్రిగా ఉండి ఉంటే ఏపీకి పెట్టుబ‌డులు రావ‌డంతోపాటు ప‌రిశ్ర‌మ‌లు కూడా భారీ స్థాయిలోనే వ‌చ్చి ఉండేవంటూ వ్యాఖ్యానిస్తున్నార‌ట‌. అంతేకాకుండా ఏపీలో యువ‌త నిరుద్యోగం కూడా త‌గ్గి ఉండేద‌ని ఆ టీడీపీ అనుకూల ప‌త్రిక ఒక‌టి క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

అయితే, ఏపీ తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం ఏపీలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వం లేక‌పోయినా వ‌చ్చే ఇబ్బంది ఏమీ లేదని చెబుతున్నారు. ఆ విష‌యాన్ని రుజువు చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకొచ్చింది.

కాగా, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందే ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ చైర్మ‌న్ కుమార మంగ‌ళం బిర్లా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దేశ రాజ‌ధాని ఢిల్లీ కేంద్రంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అనుకూల ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్‌, కుమార మంగ‌ళం బిర్లా ఇద్ద‌రి మ‌ధ్చ చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి.

ఆ క్ర‌మంల‌నే ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీని ఏపీలో స్థాపించేందుకు ఆ సంస్థ చైర్మ‌న్ కుమార మంగ‌ళం బిర్లా సంసిద్ధంగా ఉన్నారు. అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయి. క‌ర్నూలు జిల్లా పెండికోట‌లో దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబ‌డితో ఈ కంపెనీని స్థాపించ‌నున్నారు. అల్ట్రాటెక్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది.