టీడీపీ నుంచి బీజేపీలోకి కొన‌సాగుతున్న వ‌స‌లు..!

0
288

టీడీపీ నుంచి బీజేపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా అనంత‌పురం టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారాయ‌ణ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ నేత రామ్‌మాధ‌వ్ స‌మ‌క్షంలో గోనుగుంట్ల సూర్యనారాయ‌ణ బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా రామ్ మాధ‌వ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌ధానిగా ఎన్నికైన న‌రేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధిప‌థంలో తీసుకెళ్తున్నార‌న్నారు. అమిత్ షా, రామ్ మాధ‌వ్, న‌డ్డాను క‌లిశాన‌ని, బీజేపీ ఆశ‌యాలు, విధి విధానాలు న‌చ్చి తాను బీజేపీలో చేరాన‌ని గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ చెప్పారు.