గోపీచంద్‌కు ప్రేమ‌తో..

0
324

మాచో హీరో గోపిచంద్ బ‌ర్త్ డే ఇవాళ‌. 2001లో ‘తొలివ‌ల‌పు’ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన గోపీచంద్.. ఇప్ప‌టి వ‌ర‌కు 25 చిత్రాల‌లో న‌టించాడు. అయితే, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కోసం చాలా కాలంగా గోపీ శ్ర‌మిస్తున్నారు. ప్ర‌స్తుతం త‌న 26వ సినిమా త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో చాణ‌క్య అనే టైటిల్‌తో చేస్తున్నాడు.

ఈ షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైన‌ప్ప‌టికి, ఆ మ‌ధ్య‌లో గోపిచంద్ యాక్సిడెంట్ వ‌ల‌న చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ని మ‌ళ్ళీ మొద‌లు పెట్టారు. ఈ రోజు గోపిచంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇదే ఆ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌. మెహ్రీన్ హీరోయిన్‌.