“స్విగ్గీ సిక్సెస్”కు ఊహించని స్పందన : సిక్స్ కొడితే 60% డిస్కౌంట్ – IPL 2019

0
232
“స్విగ్గీ సిక్సెస్”కు ఊహించని స్పందన : సిక్స్ కొడితే 60% డిస్కౌంట్ - IPL 2019
“స్విగ్గీ సిక్సెస్”కు ఊహించని స్పందన : సిక్స్ కొడితే 60% డిస్కౌంట్ - IPL 2019

మీరు ఐపీఎల్ మ్యాచ్‌లు మిస్ కాకుండా చూస్తుంటారా ? అయితే మీకు ఈ గుడ్ న్యూస్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఇప్పుడే తెలుసుకోండి. IPL సీజన్ ను ఎలా క్యాష్ చేసుకోవాలా ? అని బడా బడా కంపెనీలు తన కస్టమర్స్ ను ఆకర్శించేందుకు అనేక ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. అందులో బాగంగానే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ “స్విగ్గీ” తన కస్టమర్స్ ని మరింత ఆకర్శించేందుకు బంఫర్ ఆఫర్ ని ప్రకటించింది. అదే IPL మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే 60% డిస్కౌంట్ ఇస్తుంది స్విగ్గీ.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్యాట్స్‌మెన్ ఎవరైనా సరే సిక్స్ కొడితే చాలు మీ ఆర్డర్‌ పై 60% తగ్గింపు ఇస్తోంది స్విగ్గీ. మ్యాచ్ జరిగినంత సేపు ప్రతీ సిక్స్‌ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. కానీ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టిన తరువాత 6 నిమిషాల్లో మీరు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టగానే స్విగ్గీ సిక్సెస్ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది.

ఆ ఆఫర్ 6 నిమిషాలు మాత్రమే ఉంటుంది. బ్యాట్స్‌మెన్ ఇలా సిక్స్ కొట్టగానే మీ ఆర్డర్ ప్లేస్ చేసెయ్యాలన్నమాట. మరీ ముఖ్యంగా ఆర్డర్ సమయంలో SWIGGY6 కూపన్ కోడ్ ఎంటర్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఆఫర్ యాప్‌ తో పాటు వెబ్‌సైట్‌ లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 23న మొదలైన ఈ బంఫర్ ఆఫర్ వచ్చేనెల మే 5 వరకు కొనసాగుతుంది. మరీ ఇంకెందుకాలస్యం త్వరపడండి.