గాయ‌త్రి గుప్తా : శృంగారం లేకుండా వంద రోజులు ఉండ‌గల‌వా..?

0
370

టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు రెడీ అవుతోంది. అందులో భాగంగా ఇప్ప‌టికే కొంత‌మందిని సెలెక్ట్ చేసిన షో నిర్వాహ‌కులు వారితో అగ్రిమెంట్‌ల‌ను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే బిగ్‌బాస్ నిర్వాహ‌కులతో అగ్రిమెంట్ పూర్తిచేసే స‌మ‌యంలో లేని నిబంధ‌న‌ల‌ను ఇప్పుడు చెప్పి లైంగికంగా వేధిస్తున్నారంటూ కొందరు ప్ర‌ముఖులు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇదే విష‌య‌మై ప్ర‌ముఖ న‌టి గాయ‌త్రి గుప్తా తాజాగా త‌న వాయిస్‌ను మీడియా ముందు వినిపించారు. బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఎంపిక ప్రక్రియ‌లో భాగంగా త‌నను లైంగికంగా వేధించార‌ని, అగ్రిమెంట్ కుదుర్చుకున్న త‌రువాత నిర్వాహ‌కులు చెప్పిన కండీష‌న్స్‌కు ఒప్పుకోకపోవ‌డంతో త‌న‌ను షో నుంచి త‌ప్పించార‌ని గాయ‌త్రి గుప్తా పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

బిగ్‌బాస్ రియాల్టీ షో నిర్వాహ‌కులు అగ్రిమెంట్ పేరుతో కొన్ని నెల‌ల‌పాటు త‌న‌ను ఇత‌ర షూటింగ్‌ల‌కు సైన్‌చేసే అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని, తీరా మీరు సెలెక్ట్ కాలేదంటూ త‌న అగ్రిమెంట్‌ను ప‌క్క‌న‌పెట్టేశార‌ని, అందుకు బ‌దులుగా బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల నుంచి త‌న‌కు ప‌రిహారం ఇప్పించ‌డంతోపాటు, త‌న‌ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో గాయ‌త్రిగుప్తా రాత‌పూర్వంగా పేర్కొంది.

రాయ‌దుర్గం పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చిన అనంత‌రం గాయ‌త్రి గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల‌తో అగ్రిమెంట్ పూర్త‌య్యాక వంద రోజుల‌పాటు శృంగారం లేకుండా ఉండ‌గలుగుతావా..? అంటూ అడిగార‌ని, ఎందుకు అలా అడిగారు అని అడిగితే.. నువ్వుచెప్పే స‌మాధానాన్నిబ‌ట్టి ప్లాన్ చేస్తామంటూ బిగ్‌బాస్ షో నిర్వాహ‌కులు చెప్పార‌ని గాయ‌త్రిగుప్తా చెప్పుకొచ్చారు. అలాగే బిగ్‌బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారు..? ఎలాంటి డ్రామాల‌ను ప్లే చేయ‌గ‌లుగుతారు..? ర‌ఘు, అభిషేక్‌, ర‌వికాంత్ వీరు ముగ్గురు షో నిర్వాహ‌కుల్లో ఉన్నార‌ని, వారు త‌న‌ను క‌లిసి మాట్లాడిన‌ట్టు గాయ‌త్రి గుప్తా చెప్పింది.