‘గ్యాంగ్ లీడ‌ర్’ వాయిదా..!

0
155

టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ షూటింగ్ నెమ్మొదిగా సాగుతోంది. అయితే, నాని షూటింగ్‌లో గాయ‌పడ‌టంతో ఇంట్లో విశ్రాంతి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో షెడ్యూల్స్ అన్నీ ఒక్క‌సారిగా తారుమారయ్యాయి. నాని కోలుకుని షూటింగ్స్‌లో పాల్గొంటున్నా అనుకున్న స‌మ‌యానికి సినిమా పూర్త‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అందుకే ఈ సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేశారు.

గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్‌ను ప్ర‌క‌టించిన రోజే చిత్ర బృందం ఓ చిన్న వీడియోను విడుద‌ల చేసింది. అదే రోజు విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 30న గ్యాంగ్ లీడ‌ర్ విడుద‌ల అవుతుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే, ఆగ‌స్టు మూడోవారం వ‌ర‌కు షూటింగ్ పూర్త‌య్యేలా క‌నిపించడం లేదు. అందుకే గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్‌ను సెప్టెంబ‌ర్‌కు మార్చార‌ట‌.

ఈ సినిమాలో నాని క్రైమ్ న‌వ‌ల‌లు రాసే ర‌చ‌యిత‌గా న‌టిస్తున్నాడు. ఐదుగురు మ‌హిళ‌లు నాని గ్యాంగ్‌, ఆ ఐదుగురు మ‌హిళ‌లు ర‌చ‌యిత ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తార‌న్న‌ది ఈ సినిమాలో ఆస‌క్తిక‌ర పాయింట్. ఇష్క్‌, హ‌లో, మ‌నం, 24 వంటి వైవిధ్య భ‌రిత‌మైన సినిమాల‌ను డైరెక్ట‌ర్ చేసిన విక్ర‌మ్ కుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. ఈ ద‌ర్శ‌కుడు సినిమా విజువ‌ల్ష్ అద్భుతంగా ఉండాల‌ని స్లోగా తెర‌కెక్కిస్తాడు. అందుకే నాని ఎంత దూకుడు చూపించినా సినిమా ముందుకు క‌ద‌ల‌డం లేద‌ని చిత్ర‌పురి కాల‌నీ వాసులు చెబుతున్నారు.