అవసరం తీరే వరకే బంధమవసరం.. ! ఆర్జీవీ ..!!

0
288
RGV movie
RGV movie Lakshmis NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాణమవుతుందని అందరికి తెలిసిందే. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చిందో ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతికి పరిచయం ఎలా ఏర్పడిందో వీరి ఇద్దరి వివాహం అయినా తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను, కుటుంబ కలహాలను ఈ సినిమాలో చూపించనున్నారు. దివంగత ఎన్టీఆర్ జీవితంపై క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కగా ప్రేక్షకులను నిరాశపరిచాయని చెప్పవచ్చు. కానీ ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నుండి ఇప్పటికే టీజర్, పాటలు విడుదలయి సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘అవసరం’ అంటూ కొనసాగుతున్న ఆసక్తి రేపే పాటను విడుదల చేశారు.

కుటుంబ నేపథ్యంలో గల బాంధవ్యాల విలువలు ఎంతవరకుంటాయో ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ‘అవసరం.. అవసరం.. ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం… వరకట్నం ఇచ్చేవరకే మామ అవసరం.. అనురాగం ఆత్మీయతలు మాయమాటలు.. అవసరం తీరే వరకే బంధం అవసరము..’ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ ఆశీర్వాదం పదే పదే తీసుకుంటూ, మరో పక్క కోపం చూపిస్తున్న సీ.ఎం చంద్రబాబు నాయుడిని మనము చూడవచ్చును. లక్ష్మీ పార్వతి విషయానికొస్తే ఎన్టీఆర్ బాధను పంచుకుంటూ, ఎన్నో సేవలు చేసే దృశ్యాన్ని ఈ సాంగ్ లో వీక్షించవచ్చు. ఈ పాట వీక్షించిన నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో ఉత్కంఠతను రేపుతున్న పాట చూస్తుంటే, సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ప్రేక్షకులు ఆలోచించేలా చేసారు ఆర్జీవీ.

ఈ పాట వీక్షించిన నెటిజన్స్ సినిమా ఫై ఎన్నో రకాల కామెంట్ చేస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తూ, సినిమాకోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. వారి కామెంట్ లోనే చూడండి.

”అవసరం అవసరం మాకు ఈ సినిమా అవసరం..
  తొందరగా రావడం అవసరం.. ఇంకా తొందరగా రావడం ఇంకా అవసరం…అవసరం…
  ఎన్టీఆర్ ఎన్నిబాధలో పడ్డాడో చూడటం అవసరం
  అవసరం..అవసరం…”  అంటూ సినిమాకోసం ఎదురుచూస్తున్న వారి అభిమానాన్ని ఆర్జీవీ పాటలోనే తెలియచేయడం     విశేషం.

Read also: