ఏపీలో నేటి నుంచి ‘జ‌న్మ‌భూమి – మా ఊరు’

0
211

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఏడాది నిర్వ‌హించే జ‌న్మ‌భూమి – మా ఊరు కార్య‌క్ర‌మాన్ని ఆరో విడ‌త‌గా నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, ఈ నాలుగున్నారేళ్ల‌లో రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధిని, సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు టీడీపీ భారీ ప్ర‌ణాళిక‌నే రూపొందించింది.

ఈ రోజు (02.1.19) నుంచి 11వ తేదీ వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌న్మ‌భూమి – మా ఊరు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నుంది. ప‌ది రోజుల‌పాటు జ‌రిగే జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ‌లా జ‌ర‌పాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా, ఈ నాలుగున్నారేళ్ల‌లో చేసిన అభివృద్ధిని టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. గ్రామాల వారీగా జ‌రిగిన అభివృద్ధి, ల‌బ్ధిదారుల వివ‌రాలు విజ‌న్ డాక్యుమెంట్ల‌ను క‌ర‌ప‌త్రాల రూపంలో ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయ‌నున్నారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాల‌పై ఒక్కో రోజు చ‌ర్చ జ‌ర‌పనున్నారు. ప్ర‌తి రోజు గ్రామాల‌వారీగా సాంస్కృతి కార్య‌క్ర‌మాల‌తోపాటు విద్యార్థుల‌కు పోటీల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 13 జిల్లాల్లోని 51 రెవెన్యూ డివిజ‌న్‌ల‌లో 31 మంది ఐఏఎస్ అధికారులతోపాటు మ‌రో ఎనిమిది మంది కేంద్ర స‌ర్వీసులకు చెందిన అధికారుల‌ను నోడ‌ల్ అధికారులుగా నియ‌మించారు.