గుండెపోటుతో గ‌ట్టు భీముడు మృతి

0
217

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల నియోజ‌క‌వ‌ర్గ‌ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గుండెపోటుతో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గట్టు భీముడు మృతిపట్ల గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.