బ‌హిర్భూమిక‌ని చెట్ల పొద‌ల్లోకి వెళ్లిన‌ ఐదు నిమిషాల‌కే..!

0
1613

శ్రీ‌కాకుళం జిల్లా రామ‌చంద్రాపురం గ్రామంలో దారుణం జ‌రిగింది. 22 ఏళ్ల ఓ యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైంది. స్థానికులు ఇచ్చిన‌ స‌మాచారంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి కేసు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తులో యువ‌తి హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌వ‌స్తాయ‌ని పోలీసులు తెలిపారు.

దారుణ హ‌త్యకు సంబంధించి కేసు న‌మోదు చేసిన పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. రామ‌చంద్రాపురం గ్రామానికి చెందిన మహంతి, రాధామ‌ణిల‌కు క‌న‌క‌ల‌త అనే 22 ఏళ్ల కుమార్తు ఉంది. మ‌హంతి స్థానికంగానే ఉంటూ వంట మాస్ట‌ర్‌గా ప‌నిచేస్తుండగా, రాధామ‌ణి విద్యా వాలెంటీరుగా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు.

మృతురాలు క‌న‌క‌ల‌త‌, త‌న త‌ల్లి రాధామ‌ణికి ఊర‌వ‌త‌ల ఉన్న బావి వ‌ద్దకు వెళ్లి స్నానం చేయ‌డం అల‌వాటు. ప్ర‌తీ రోజూ ఇద్ద‌రూ క‌లిసిపోయేవారు. కానీ శ‌నివారం నాడు క‌ల‌క‌ల‌త ఒక్క‌టే స్నానం నిమిత్తం బావి వ‌ద్ద‌కు వెళ్లింది. త‌న‌వెంట తీసుకెళ్లిన బ‌క్కెట్‌, మ‌గ్గుతోపాటు వెంట తెచ్చుకున్న దుస్తుల‌ను రోడ్డుమీద‌నే ఉంచి బ‌హిర్భూమి నిమిత్తం చెట్ల పొద‌ల్లోకి వెళ్లింది.

ఊర‌వ‌త‌ల ఉన్న బావి వైపు రాక‌పోక‌లు సాగిస్తున్న కొంద‌రు బక్కెట్‌, మ‌గ్గు, దుస్తులు రోడ్డుపైనే చాలా సేపు ఉండ‌టాన్ని గ‌మ‌నించి అనుమానంతో చెట్ల పొద‌ల్లో చూడ‌గా క‌న‌క‌ల‌త విగ‌త జీవిగా పడిఉంది. మృత‌దేహాన్ని ప‌రిశీలించిన పోలీసులు క‌న‌క‌ల‌త మెడ‌కు కండువా బిగించి ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. క‌న‌క‌ల‌త మృతి ముమ్మాటికి హ‌త్యేన‌ని, ఆ కోణంలోనే విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.