కీల‌క నిర్ణ‌యాలు : ఏపీ కేబినేట్ తొలి స‌మావేశంలో..!

0
73

ఏపీ కేబినేట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. సామాజిక పింఛ‌న్‌ల‌ను రూ.2,250ల‌కు, ఆశావ‌ర్క‌ర్ల జీతాల‌ను రూ.3వేల నుంచి రూ.10వేల‌కు పెంచుతూ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యానికి రాష్ట్ర కేబినేట్ ఆమోద‌ముద్ర వేసింది. అలాగే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఐఆర్ చెల్లింపుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు మంత్రివ‌ర్గం సుముఖ‌త వ్య‌క్తం చేసింది.

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనానికి సంబంధించి వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క్రియను ప్రారంభించాల‌ని జ‌గ‌న్ కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోప‌క్క వైఎస్ఆర్ రైతు భరోసా ప‌థ‌కం అమ‌లుపై ఇంకా చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ఆర్ రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లును అక్టోబ‌ర్ 25 నుంచి ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ సూచించిన‌ట్లు స‌మాచారం.