ఫిల్మ్ఇండస్ట్రీ కేర్ అఫ్ అడ్రస్ వైసీపీ..!

0
618
tollywood stars are joined in ycp

టాలీవుడ్ లో బుల్లితెర, వెండితెర తేడా లేకుండా అందరు వైసీపీకి బాట పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ జాడ వెతుక్కుంటూ వెళ్లి మరి పరుగులు పడుతున్నారు. జీవిత రాజ‌శేఖ‌ర్ వెళ్లి ఈరోజు కలవడంతో.. కండువాతో వైసీపీ అధినేత సాదరంగా ఆహ్వానించాడు.

jeevitha rajashekar jaoined in ycp
jeevitha rajashekar joined in ycp

వీరితో పాటు బుల్లితెర నటులు శ్యామల , ఆమె భర్త నర్సింహా రెడ్డి జగన్ పంచ‌న చేరారు. రోజా, 30 ఇయ‌ర్స్ పృథ్వీ, కృష్ణుడు, పోసాని కృష్ణ ముర‌ళి, శివాజీ రాజా, పివిపి, జయసుధ‌, ఆలీ, రాజా రవీంద్ర, మోహన్ బాబు  సినీతారలంతా వైసీపీ కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారిపోతున్నారు. టాలీవుడ్ చూపంతా వైసీపీ వైపే ఉన్నాయనడంలో ఇంతకన్న వేరే నిదర్శనం కావాలా?

anchor shyamala
anchor shyamala and her husband joined in ycp

కమెడియన్ ఆలీ మాత్రం ఎక్కడ పోటీ చేయాల్సిన అవసరం లేదని, చేయకుండానే మంత్రి పదవి ఇస్తానని జగన్ మాట ఇవ్వడంతో టీడీపీ ని కాదనుకొని వైసీపీలో చేరాడు. ఇలా జగన్నాథుడు ఏం మాయచేస్తున్నాడో కానీ.. తారలంతా ఆ పార్టీలోనే తళుక్కు మంటున్నారు. ఆశ్చర్యకరమేమిటంటే .. సహనటుడైనా పవన్ కళ్యాణ్ కి ఓ పార్టీ ఉంది . కానీ ఆ పార్టీ లో చేరకుండా అడుగులు వైసీపీ గా పడుతున్నాయి. పరుగులు తీయడమే కాకుండా పవన పై విమర్శలు కూడా కురిపించడం మొదలు పెట్టారు.

camedian ali joined in ycp
camedian ali joined in ycp